ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ‘టీ ప్రైడ్‌’

ABN , First Publish Date - 2021-06-18T05:50:13+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు స్వయంఉపాధి పొందడానికి టీ ప్రైడ్‌ (స్టాండ్‌ ఫర్‌ తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యూటేషన్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఇన్సెంటీవ్‌ స్కీం) పేరిట పెట్టుబడి ఆధారిత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఔత్సాహికులు బ్యాంకు రుణంతో వాహనాన్ని కొనుక్కుంటే పరిశ్రమలశాఖ నుంచి 35 శాతం రాయితీ అందిస్తున్నారు. ఈ పథకం కింద రూ. 75 లక్షల వరకు విలువ చేసే రవాణా వాహనాలకు సబ్సిడీ అందజేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ‘టీ ప్రైడ్‌’

రవాణా వాహనాలకు 35 శాతం రాయితీ

2020–21 సంవత్సరంలో 179 యూనిట్లు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 17: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు స్వయంఉపాధి పొందడానికి టీ ప్రైడ్‌ (స్టాండ్‌ ఫర్‌ తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యూటేషన్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఇన్సెంటీవ్‌ స్కీం) పేరిట పెట్టుబడి ఆధారిత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఔత్సాహికులు బ్యాంకు రుణంతో వాహనాన్ని కొనుక్కుంటే పరిశ్రమలశాఖ నుంచి 35 శాతం రాయితీ అందిస్తున్నారు. ఈ పథకం కింద రూ. 75 లక్షల వరకు విలువ చేసే రవాణా వాహనాలకు సబ్సిడీ అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించారు. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎం, జేసీబీ, హార్వెస్టర్‌, బోర్‌మిషన్లు తదితర వాహనాలకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకానికి చదువు, వయోపరిమితి, ఆదాయం వంటి కచ్చితమైన నిబంధనలేమీ లేవు. ఎస్సీ, ఎస్టీ, మహిళలతో పాటు దివ్యాంగులైన మహిళలు అర్హులు. ఔత్సాహికులు ముందుగా పూర్తిమొత్తం చెల్లించి వాహనాలను కొనుగోలుచేసిన అనంతరం సబ్సిడీ కోసం ధరఖాస్తు చేసుకోవాలి.


గతేడాది రూ. 4.88 కోట్ల సబ్సిడీ

టీ–ప్రైడ్‌ పథకం కింద మెదక్‌ జిల్లాలో 2020–21 సంవత్సరంలో 179 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీరికి 4.88 కోట్ల రూపాయలను సబ్సిడీగా చెల్లించారు. రాష్ట్రస్థాయిలో సీనియారిటీ ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ సోమ్మును జమ చేశారు. 


సద్వినియోగం చేసుకోండి : కృష్ణమూర్తి, జనరల్‌ మేనేజర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం, మెదక్‌

టీ ప్రైడ్‌ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం కింద జిల్లాలో లబ్ధిదారులు ఎక్కువగా ట్రాక్టర్లు, కార్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేశారు. వాహనం కొనుగోలు చేసిన అనంతరం కమర్షియల్‌ వెహికిల్స్‌గా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అనంతరం ఆరు నెలల్లో సబ్సిడీ కోసం ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2021-06-18T05:50:13+05:30 IST