‘లంఖణం’ పరమౌషధమే!

ABN , First Publish Date - 2021-10-19T05:30:00+05:30 IST

వరాత్రుల ఉపవాసాలతో బలహీనపడిపోయాం అనుకుంటున్నారా? కానే కాదు. ఉపవాసం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకుని కొత్త శక్తి ...

‘లంఖణం’ పరమౌషధమే!

నవరాత్రుల ఉపవాసాలతో బలహీనపడిపోయాం అనుకుంటున్నారా? కానే కాదు. ఉపవాసం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకుని కొత్త శక్తి పుంజుకుంటుందనీ, ‘ఆటోఫజీ’ అనే ఈ వినూత్న జీవక్రియ వల్ల ఆరోగ్యం మెరుగవుతుందనీ జపాన్‌ శాస్త్రవేత్త యోషినోరి ఓషుమి అంటున్నారు.


ఉపవాసంతో రెండు రకాల ప్రయోజనాలు పొందుతాం. శరీరంలో దెబ్బతిన్న కణాలు తమను తాము తినటం, లేదా తమను తాము నాశనం చేసుకోవటం వల్ల గ్రోత్‌ హార్మోన్‌ వృద్ధి చెంది కొత్త కణాల పుట్టుక ప్రేరేపితమవుతుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో ‘ఆటోఫజీ’ అంటారు. శరీరంలో పేరుకుపోతూ ఉండే పాడయిన, చనిపోయిన, మరమ్మతు అవసరమైన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకోవటమే ఆటోఫజీ. సాధారణంగా కొత్త కణాలన్నీ ఈ సూత్రం ఆఽధారంగానే పుట్టుకొస్తూ ఉంటాయి. అవి పుట్టేటప్పుడు పైపొరల్ని తయారు చేసుకునే క్రమంలో చనిపోయిన, మరమ్మత్తు అవసరమైన కణాల్ని దొరకబుచ్చుకుని, వాటిని చీల్చి, మాలిక్యూల్స్‌ని శక్తిగా వాడుకుంటాయి. ఈ చర్య ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుందని, కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన లాభం పొందవచ్చని జపనీస్‌ సైంటిస్ట్‌ ‘యోషినోరి ఓషుమి’ అంటున్నారు. 


ఉపవాసం ఉన్నప్పుడు?

ఆటోఫజీని ఉపవాసం ప్రేరేపించటానికి కొన్ని కారణాలున్నాయి. ఉపవాసంలో ఉన్నప్పుడు తినటానికి ఆహారం అందుబాటులో లేదనే విషయాన్ని మన శరీరం మెదడుకు తెలుపుతుంది. దాంతో మెదడు నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని శరీరాన్ని ఆదేశిస్తుంది. అప్పుడు శరీర కణాలు శక్తి కోసం పాతవి, వయసు మీరినవి అయిన పనికిరాని ప్రొటీన్ల మీద దాడి చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే?... ఆహారం శరీరానికి అందనప్పుడు ఇన్సులిన్‌ లెవెల్స్‌ పడిపోయి దానికి వ్యతిరేకమైనదైన గ్లూకగాన్‌ విజృంభించటం మొదలుపెడుతుంది. ఈ గ్లూకాగాన్‌ యాక్టివేట్‌ అయి శరీరంలో శుభ్రం చేయాల్సిన, నిరర్ధకంగా పడిఉన్న కణాల మీదకు దృష్టి మళ్లిస్తుంది. ఆ క్రమంలో గ్రోత్‌ హార్మోన్‌ ప్రేరేపితమై పాత కణాల స్థానంలో కొత,్త శక్తివంతమైన కణాల తయారీ మొదలవుతుంది.

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST