లఖ్‌నవూ: సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో రష్యా క్రీడాకారిణి ఎవ్‌గెనియా కొసెత్సకయాపై సింధు విజయం సాధించింది. ఎవ్‌గెనియాపై తొలి గేమ్‌ను 21-11 తేడాతో సింధు గెలిచింది. తొలిగేమ్ తర్వాత పోరు నుంచి ఎవ్‌గెనియా కొసెత్సకయా వైదొలిగింది. నేడు ఫైనల్‌లో భారత్‌కు చెందిన మాళవికతో సింధు తలపడనుంది.
ఇవి కూడా చదవండి