‘శ్యామ్‌ సింగ రాయ్‌’ హక్కులు వారివే!

నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రం తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల ఆడియో హక్కులను సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లో అత్యధిక మొత్తంలో అమ్ముడుపోయిన ఆడియో రైట్స్‌ ఈ చిత్రానిదే అని మేకర్స్‌ చెబుతున్నారు. మిక్కీ.జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్‌, కృతీశెట్టి నాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా ఉండనున్నాయి. సత్యదేవ్‌ జంగా కథ అందించిన ఈ చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. 


Advertisement