ఆర్టీసీ వద్ద నిరసన తెలియజేస్తున్న ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు
రాపూరు, జనవరి 24: సమస్యలు పరిష్కరించాలంటూ రాపూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మికులు సోమవారం ఆందోళన చేశారు. 2017 ఆర్పీఎస్ బకాయిల చెల్లింపు, 19శాతం ఫిట్మెంట్ వ్యత్యాసం సర్దుబాటు,హెచ్ఆర్ఏ తగ్గింపు, సీసీఏ రద్దు జీవోల రద్దు, 11వ పీఆర్సీ ఫిట్మెంట్ వర్తింపజేయాలంటూ యూనియన్ నాయకులు భాస్కర్, డీబీకే రెడ్డి డిమాండ్ చేశారు.