ఖడ్గధారి కీర్తి

కుందనపు బొమ్మ కత్తి చేతబట్టారు. సముద్రపు సింహం మరక్కార్‌కు జోడీగా కదనరంగంలోకి  అడుగుపెట్టబోతున్నారు.  కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మరక్కార్‌’. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీర్తిసురేష్‌ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చేతిలో ఖడ్గం, పవర్‌ఫుల్‌ లుక్‌లో కీర్తిసురేష్‌ రాజసం ఉట్టిపడేలా రూపొందించిన పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Advertisement