చురుకైన చేప స్వోర్డ్‌ ఫిష్‌!

ABN , First Publish Date - 2020-08-19T05:30:00+05:30 IST

ఈ చేప ముందు భాగంలో పొడవైన, పదునైన నిర్మాణం ఉంటుంది. ఇది కత్తిని పోలి ఉంటుంది. అందుకే ఈ చేపకు స్వోర్డ్‌ ఫిష్‌ అని పేరు...

చురుకైన చేప స్వోర్డ్‌ ఫిష్‌!

ఈ చేప ముందు భాగంలో పొడవైన, పదునైన నిర్మాణం ఉంటుంది. ఇది కత్తిని పోలి ఉంటుంది. అందుకే ఈ చేపకు స్వోర్డ్‌ ఫిష్‌ అని పేరు. సముద్రజలాల్లో అతివేగంగా కదిలే చేపల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది.


  1. స్వోర్డ్‌ ఫిష్‌ ఇతర చేపలతో కలిసి జీవించదు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఈ చేప కళ్ల దగ్గర ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది చల్లటి నీటిలో ఉన్నప్పుడు కళ్లు, మెదడును వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇతర చేపల వలే దీనికి పొలుసులు ఉండవు.
  2. ఈ చేప పదిహేను అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇది ఇతర చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది.
  3. ఇది ఎక్కువగా హిందు మహాసముద్రంలో, పసిఫిక్‌, అట్లాంటిక్‌ జలాల్లోనూ కనిపిస్తుంది. నీళ్లు మరీ చల్లగా ఉండని ప్రదేశాల్లో ఉంటుంది. వేసవిలో వెచ్చటి నీళ్లలో, చలికాలంలో చల్లటి నీటిలో ఉండటానికి ఇష్టపడుతుంది. 
  4. సముద్ర జలాల్లో లోతైన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. 550 మీటర్ల లోతు వరకు వెళుతుంది. ఈ చేపను ఆహారంగా తీసుకుంటారు. 450 కేజీల వరకు స్వోర్డ్‌ ఫిష్‌ బరువు ఉంటుంది.

Updated Date - 2020-08-19T05:30:00+05:30 IST