నాన్న కోసం...

ABN , First Publish Date - 2022-06-23T08:57:10+05:30 IST

స్విమ్మింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో ఉక్రెయిన్‌ స్విమ్మర్‌ మైఖైలో రోమన్‌చుక్‌ కాంస్యం సాధించాడు. కా

నాన్న కోసం...

బుడాపెస్ట్‌: స్విమ్మింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో ఉక్రెయిన్‌ స్విమ్మర్‌ మైఖైలో రోమన్‌చుక్‌ కాంస్యం సాధించాడు. కానీ, ఈ సందర్భంగా రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న తన తండ్రిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. లొకేషన్‌ను గుర్తించి దాడులు చేస్తుండడంతో.. యుద్ధభూమిలో ఉన్న తండ్రితో మాట్లాడే ధైర్యం కూడా చేయలేక పోతున్నానన్నాడు. కానీ, ‘ఓకే’ అంటూ ప్రతి ఉదయం ఆయన మెసేజ్‌లు పంపిస్తున్నాడని తెలిపాడు. స్విమ్మింగ్‌ ద్వారానే ఉక్రెయిన్‌ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాని రోమన్‌చుక్‌ చెప్పాడు. 

Updated Date - 2022-06-23T08:57:10+05:30 IST