సిద్దిపేటలో జిల్లాస్థాయి ఈత పోటీలు

ABN , First Publish Date - 2022-05-24T05:20:50+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే ఏడో రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశారు. ఇందుకోసం అండర్‌ 17, అండర్‌ 14, అండర్‌ 11 విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులకు పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో 120 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభను చాటిన 40 మందిని జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేశారు.

సిద్దిపేటలో జిల్లాస్థాయి ఈత పోటీలు
ఈత పోటీల్లో భాగంగా పూల్‌లో డైవ్‌ చేస్తున్న బాలికలు

సిద్దిపేట టౌన్‌, మే 23: సిద్దిపేట పట్టణంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే ఏడో రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశారు. ఇందుకోసం అండర్‌ 17, అండర్‌ 14, అండర్‌ 11 విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులకు పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో 120 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభను చాటిన 40 మందిని జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేశారు. పోటీలను స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బర్ల మల్లికార్జున్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు రంగనాథ్‌, నాయకుడు బందారం రాజు, పీఈటీలు ప్రదీప్‌, రాజయ్య, ప్రేమ్‌నారాయణ, మధు, అశోక్‌, లక్ష్మణ్‌, కనకయ్య, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:20:50+05:30 IST