స్విగ్గీ రూ.5,225 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2022-01-25T08:18:49+05:30 IST

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ తాజాగా 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,225 కోట్లు)నిధులు సమీకరించినట్టు సోమవారం వెల్లడించింది....

స్విగ్గీ రూ.5,225 కోట్ల సమీకరణ


న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ తాజాగా 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,225 కోట్లు)నిధులు సమీకరించినట్టు సోమవారం వెల్లడించింది. తన వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడానికి,  క్విక్‌ కామర్స్‌ గ్రోసరీ సర్వీస్‌ ఇన్‌స్టామార్ట్‌ బలోపేతానికి నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ 1,070 కోట్ల డాలర్లకు చేరుకుంది. 

Updated Date - 2022-01-25T08:18:49+05:30 IST