ముంబైలో భారీ వర్షాలు.. గుర్రమెక్కిన Swiggy Delivery Boy

ABN , First Publish Date - 2022-07-03T22:00:44+05:30 IST

మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)ని వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. స్విగ్గీ(Swiggy) డెలివరీ బాయ్ వీడియో ఒకటి

ముంబైలో భారీ వర్షాలు.. గుర్రమెక్కిన Swiggy Delivery Boy

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)ని వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. స్విగ్గీ(Swiggy) డెలివరీ బాయ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను దున్నేస్తోంది. నగరంలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బైక్‌పై ప్రయాణించేందుకు రోడ్లు వీలుగా లేకపోవడంతో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రమెక్కాడు. వెనక బ్యాగ్ తగిలించుకుని ఆర్డర్లు డెలివరీ చేసేందుకు గుర్రంపై వెళ్తున్న అతడిని తన మొబైల్‌లో బంధించిన ఓ వ్యక్తి దానిని సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఐదు సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వృత్తిపై అతడికున్న నిబద్ధతకు అచ్చెరువొందుతున్నారు. కొందరు దీనిని ‘రాయల్ డెలివరీ’ అని పిలుస్తుంటే, మరికొందరు లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు. కాగా, ముంబైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉండడంతో వాతారణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో రెండు భవనాలు నేలకూలాయి. 



Updated Date - 2022-07-03T22:00:44+05:30 IST