ఈ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.16వేలు.. దీని ప్రత్యేకత ఏంటంటే!

ABN , First Publish Date - 2022-01-07T02:43:58+05:30 IST

సాధారణంగా చాలా మంది.. మిఠాయిలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందుకు తగ్గట్టే మన దేశంలో అనేక రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. వెండి రేకులు కలిగిన స్వీట్లు కూడా

ఈ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.16వేలు.. దీని ప్రత్యేకత ఏంటంటే!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా చాలా మంది.. మిఠాయిలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందుకు తగ్గట్టే మన దేశంలో అనేక రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. వెండి రేకులు కలిగిన స్వీట్లు కూడా దుకాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. బంగారు పూత ఉన్న స్వీట్లను బహుశా ఎవరూ చూసుండకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. స్వీట్లపై బంగారాన్ని పూతగా కూడా వేస్తారనే ఆలోచన కూడా ఎవరూ చేసుండరేమో. కానీ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి మాత్రం భిన్నంగా ఆలోచించి.. బంగారు పూతతో స్వీట్లను రెడీ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షాగూన్ స్వీట్ దుకాణంలో.. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ నిర్ధిష్టమైన స్వీట్‌కు ఒక వ్యక్తి 24 క్యారెట్ల బంగారు రేకులను పూతగా వేసి.. ఆ తర్వాత దానిపై కుంకుమ పువ్వు చల్లి అందంగా అలంకరిస్తున్నాడు. ఈ దృశ్యాలను ఓ ఫుడ్ బ్లాగర్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. బంగార పూతతో రెడీ అయిన స్వీట్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారట. రూ.16వేలకు కేజీ అయినప్పటికీ జనం మాత్రం అస్సలు తగ్గట్లేదట.






Updated Date - 2022-01-07T02:43:58+05:30 IST