భోజనం తరువాత తీపి కోసం

ABN , First Publish Date - 2020-10-25T19:41:20+05:30 IST

మనలో చాలామంది భోజనం తరువాత ఏదైనా తీపిపదార్థం తింటాం. అలా తీపి తినాలనుకునేవారు నెయ్యి, బెల్లం కలిపి తింటే మేలు చేస్తుంది అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా

భోజనం తరువాత తీపి కోసం

ఆంధ్రజ్యోతి(25-10-2020)

మనలో చాలామంది భోజనం తరువాత ఏదైనా తీపిపదార్థం తింటాం.  అలా తీపి తినాలనుకునేవారు నెయ్యి, బెల్లం కలిపి తింటే మేలు చేస్తుంది అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. పోషకాలతో నిండిన ఈ మిశ్రమం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. బెల్లం, నెయ్యి మిశ్రమంలో ఐరన్‌, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి.


నెయ్యి, బెల్లం కలిపి తింటే హార్మోన్ల పనితీరు బాగుంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఒంట్లోని విషపదార్థాలను నెయ్యి, బెల్లం మిశ్రమం తొలగిస్తుంది. అంతేకాదు చర్మం, కురులు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీసుకొనే బెల్లంలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తాయి. నెయ్యిలో ఫ్యాటీ ఆమ్లాలు, ఎ, ఇ, డి విటమిన్లు ఉంటాయి. దీనిలోని విటమిన్‌ కె ఎముకలు కాల్షియాన్ని గ్రహించేలా చేస్తుంది.

Updated Date - 2020-10-25T19:41:20+05:30 IST