తీపి బూరెలు

ABN , First Publish Date - 2021-02-03T21:08:54+05:30 IST

శనగపప్పు - 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం - ఒక కప్పు, బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు -

తీపి బూరెలు

కావలసిన పదార్థాలు: శనగపప్పు - 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం - ఒక కప్పు, బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు - ముప్పావు కప్పు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, నీరు - 4 కప్పులు, యాలకుల పొడి - అర టీ స్పూను, బాదం, జీడిపప్పు - 5 చొప్పున, ఉప్పు - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: బియ్యం, మినప్పప్పు కలిపి 5 గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికించి నీరు వడకట్టి బరకగా రుబ్బాలి. చిన్నమంటపై కడాయిలో నెయ్యి వేసి రుబ్బిన పప్పు, యాలకుల పొడి, కొబ్బరి తురుము కలిపి పొడిగా అయ్యాక దించేసి బాగా చల్లారనివ్వాలి. నిమ్మకాయంత ముద్దలు చేసి రుబ్బిన బియ్యప్పిండిలో ముంచి నూనెలో దోరగా వేగించాలి.   



Updated Date - 2021-02-03T21:08:54+05:30 IST