స్వీడన్‌లోనూ మిన్నంటిన నిరసనలు..!

ABN , First Publish Date - 2020-06-05T06:03:35+05:30 IST

జార్జి ఫ్రాయిడ్ అనే నల్లజాతీయుడి ఘటనపట్ల యావత్తు అమెరికా అట్టుడుకుతోంది. అమెరికాలో అన్ని ప్రధాన నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు.

స్వీడన్‌లోనూ మిన్నంటిన నిరసనలు..!

స్టాక్‌హోమ్: జార్జి ఫ్రాయిడ్ అనే నల్లజాతీయుడి ఘటనపట్ల యావత్తు అమెరికా అట్టుడుకుతోంది. అమెరికాలో అన్ని ప్రధాన నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. ఈ నిరసనలు ఇతర దేశాలకూ విస్తరించాయి. తాజాగా స్వీడన్‌లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి.. ఫ్లాయిడ్‌ను హత్య చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో.. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేశారు. దీంతో స్వీడన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  రోడ్లపైకి రావొద్దని నిరసనకారులకు సూచించింది. డిజిటల్ పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలని కోరింది. కాగా.. స్వీడన్‌లో ఇప్పటి వరకు 41వేల కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 4వేల మంది మహమ్మారికి బలయ్యారు. 


Updated Date - 2020-06-05T06:03:35+05:30 IST