Abn logo
Sep 23 2020 @ 12:46PM

బిగ్‌బాస్‌ 4లో మరో వైల్డ్‌ కార్డ్‌.. ఇమేజ్ లేని హీరోయిన్ ఎంట్రీ

Kaakateeya

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మూడో వారంలోకి ప్రవేశించింది. నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు ఎలిమినేషన్స్‌ అయ్యాయి. అలాగే మరోవైపు కుమార్‌ సాయి, అవినాష్‌లు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌ కూడా పూర్తయ్యాయి. అయితే తాజా సమాచారం మేరకు మూడో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందట. ఈ వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఓ హీరోయిన్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారు నిర్వాహకులు.  ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. స్వాతి దీక్షిత్‌. 'జంప్‌ జిలానీ, బ్రేకప్‌, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌, చిత్రాంగద' వంటి తెలుగు చిత్రాల్లో నటించిన స్వాతి దీక్షిత్‌ తమిళ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవీ లేవు.. అదే సమయంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఆఫర్‌ రావడంతో స్వాతి దీక్షిత్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పారనే న్యూస్‌ వైరల్ అవుతోంది. అయితే ఇమేజ్ లేని స్వాతి దీక్షిత్ వస్తే ఒరిగిదేమిటో వారికే తెలియాలి. 




Advertisement
Advertisement