స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించాలి

ABN , First Publish Date - 2022-08-08T06:15:30+05:30 IST

స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించాలి

స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించాలి
ఉయ్యూరులో జాతీయ పతాకాలతో ప్రదర్శన

పెనమలూరు, ఆగస్టు 7 : ఎందరో మహనీ యులు తమ ప్రాణత్యాగాలతో సాధించి పెట్టిన స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే కె. పార్థసారథి పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని తాడిగడప వంద అడుగుల రోడ్డు నుంచి పెనమలూరు సెంటరు వరకు రెండు వందల అడుగుల జెండాతో భారీ ఎత్తున జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపల్‌ కమిషనర్‌ ప్రకాశరావు, తహసీల్దారు భద్రు, టిడ్కో డైరెక్టరు పోరంకి చిన్నారి, క్రిస్టఫర్‌, బాజీ, బాలకృష్ణ, నరేంద్ర పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌  : జాతీయ జెండా ఔన్న త్యాన్ని కాపాడుతూ, దేశ ఖ్యాతిని, స్వాతంత్య్ర స్ఫూర్తిని దశదిశలా చాటేలా ప్రతి పౌరుడు మసులు కోవాలని బాపులపాడు ఎంపీపీ వై.నగేష్‌ అన్నారు. ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆది వారం  బాపులపాడులో ఎంపీడీవో కె.పార్థసారథి ఆధ్వర్యం లో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహిం చారు. మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ప్రారంభించిన ర్యాలీ గ్రామంలోని పలు వీధుల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, నగేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, తహసీల్దార్‌ టి.మల్లికార్జునరావు  మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ తానీషా, బాపులపాడు సర్పంచ్‌ సరిపల్లి కమలాబాయి,  సీఐ కె.సతీష్‌,   కార్యదర్శి చోరగుడి ప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఉయ్యూరు: అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ఉయ్యూరు  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1989-1990 బ్యాచ్‌  పూర్వ విద్యార్థుల మిత్ర బృందం ఆధ్వర్యంలో  ఆదివారం జాతీయ పతాకాల పంపిణీ, అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉయ్యూరు పట్టణ ఎస్సై ఎన్‌.వీరప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజ రై జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.  అనంతరం జాతీయ పతాకాలు చేతబూని  పాఠశాల నుంచి  ప్రధాన సెంటర్‌ వరకు ప్రదర్శన జరిపి  జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. 

Updated Date - 2022-08-08T06:15:30+05:30 IST