Abn logo
Sep 27 2021 @ 00:10AM

ఎస్‌.పి.బాలుకు స్వరనీరాజనం

స్వరనీరాజనం అందించిన గాయనీ గాయకులు

80 మంది గాయనీగాయకుల 12 గంటల గానామృతం

విశాఖపట్నం, సెప్టెంబరు 26: గాన గంధ ర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలోని గాయనీ గాయకులు ఆదివారం ఆయనకు స్వర నీరాజనం అర్పించారు. రాగమాలిక సాంస్కృతిక సంస్థ, విశాఖ సింగర్స్‌ పాయింట్‌, వాయిస్‌ ఆఫ్‌ విశాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో 80 మంది గాయనీగాయకులు 12 గంటలపాటు నిర్వి రామంగా బాలసుబ్రహ్మణ్యం పాటలు ఆలపిస్తూ ఆయనకు అంజలి ఘటించారు. తొలుత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, ఏడీసీపీ ఖాన్‌లు బాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


అనంతరం వారు మాట్లాడుతూ సంగీత ప్రియుల మనస్సుల్లో ఎస్పీబీకి చిరస్మరణీయ స్థానం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాగమాలిక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, జయసింహారెడ్డి, ప్రభ, సుభాషిణి, కుమార్‌రెడ్డి,  పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.