Swara Bhasker : నా మనసులో మాట చెప్పినందుకు... నన్ను శిక్షించారు

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తన ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో ఆమె ఎవ్వరికీ భయపడక తన మదిలోని మాటని బాహాటంగా చెప్పినందుకు కాంట్రాక్టులు రద్దు చేశారట. ఆ విధంగా తన వాక్ స్వాతంత్ర్యాన్ని వాడుకున్నందుకు శిక్షింపబడాల్సి వచ్చిందట. కొన్నాళ్ల క్రితం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల గురించి ప్రస్తావిస్తూ ఆమె ఆ విధంగా వాపోయింది... 


సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా నా ఒపీనియన్ తెలియజేసినందుకు నేను ‘పనిష్’ చేయబడ్డాను అన్న స్వర... అప్పట్లో చాలా కమర్షియల్ బ్రాండ్స్ తనతో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నాయని తెలిపింది. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా స్వర నిరసనల్లో పాల్గొంటూ తమ ప్రాడక్ట్స్‌కు చెడ్డ పేరు తెస్తోందని ఆయా బ్రాండ్స్ వారు అన్నారట. అయితే, ఈ దేశంలోని రాజ్యాంగబద్ధమైన విలువల కోసం తనను ఎవరు, ఎలా శిక్షించినా వెనుకడుగు వేయనని స్వరా భాస్కర్ స్పష్టం చేసింది. తాను నమ్మిన దాని కోసం ఎలాంటి శిక్షకైనా రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ... 

Advertisement

Bollywoodమరిన్ని...