బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-07-12T07:37:53+05:30 IST

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులైన స్పప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం బెంగళూరులో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి...

బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ అరెస్టు

కోచి, జూలై 11: బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులైన స్పప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం బెంగళూరులో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి. 30 కిలోల బంగారం అక్రమ రవాణా కేసులో నలుగురు ప్రధాన నిందితుల్లో స్వప్నా సురేశ్‌ ఒకరు. ఈ కేసులో ఆమెతో పాటు సందీప్‌ నాయర్‌, సరిత్‌, ఫజిల్‌ ఫరీద్‌ను నిందితులుగా ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ కేసులో కేరళ హైకోర్టులో స్వప్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను ఎన్‌ఐఏతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి.


Updated Date - 2020-07-12T07:37:53+05:30 IST