Abn logo
Feb 21 2020 @ 23:19PM

స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ జిల్లా అంది గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనతో ముర్షీదాబాద్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది.  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వివేకానంద అభిమానులు కోరుతున్నారు. మరోవైపు దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement