గురు, శుక్రులకు శాంతి హోమంతో మేలు

ABN , First Publish Date - 2021-05-17T06:21:44+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విలయతాండవం కారణంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయని, దీనిని అదుపుచేయడానికి గురు, శుక్ర గ్రహాలకు సామూహిక శాంతి హోమాలు చేస్తే కొంత మేర ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గురు, శుక్రులకు శాంతి హోమంతో మేలు
స్వామి శివానందలహరి

గుణదల, మే 16 :  దేశంలో కరోనా మహమ్మారి, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విలయతాండవం కారణంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయని, దీనిని అదుపుచేయడానికి గురు, శుక్ర గ్రహాలకు సామూహిక శాంతి హోమాలు చేస్తే కొంత మేర ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  1962లో ప్లవనామ సంవత్సరం వచ్చిన సమయంలోనూ కలరా వ్యాధి వచ్చి అనేక మంది ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. అదే సమయంలో ఇండియా - చైనా యుధ్దం కూడా జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా నమోదయిందన్నారు. అదే ప్లవనామ సంవత్పరం తిరిగి 2021లో రావడంతో కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఉగ్రంగా ఉన్న గురు, శుక్రులకు సామూహిక శాంతి పూజలు, శాంతి హోమాలు చేస్తే చాలా వరకు ప్రస్తుతం తలెత్తిన ఉపద్రవాల నుంచి ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-17T06:21:44+05:30 IST