కదిరి, మే28: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. వైశాఖమాసం బహుళత్రయోదశి భరణి నక్షత్రం కావడం, వారాంతపు సెలవు సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయంతో పాటు తిరువీధులు సైతం భక్తులతో సందడిగా కనిపించాయి.