దుర్గతి నాశనీ.. శరణు.. శరణు..

ABN , First Publish Date - 2022-10-04T05:15:12+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల ఎనిమిదో రోజు సోమవారం సకల దుర్గతులను బాపెడి దుర్గాదేవిగా అమ్మవారు జిల్లావ్యాప్తంగా భక్తులకు దర్శనమిచ్చారు.

దుర్గతి నాశనీ.. శరణు.. శరణు..

పుట్టపర్తి/కదిరి: శరన్నవరాత్రి ఉత్సవాల ఎనిమిదో రోజు సోమవారం సకల దుర్గతులను బాపెడి దుర్గాదేవిగా అమ్మవారు జిల్లావ్యాప్తంగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాష్టమి ప్రత్యేకం. దీంతో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.

    శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవీభూదేవి సమేతుడైన శ్రీవారికి అర్చకులు మోహినీ అలంకారం చేశారు. సుగంధ ద్రవ్యాలు, కదిరి మల్లెలతో అలంకరించారు. మోహినీ అవతారంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుని, భక్తులు తన్మయత్వం పొందారు.


Updated Date - 2022-10-04T05:15:12+05:30 IST