పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-24T04:39:25+05:30 IST

పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని డీఎల్‌పీవో ఎం.బాలామణి అన్నారు.

పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలి
స్వచ్ఛ సంకల్పం సమీక్షలో మాట్లాడుతున్న డీఎల్‌పీవో బాలామణి

బుట్టాయగూడెం, జూన్‌ 23: పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని డీఎల్‌పీవో ఎం.బాలామణి అన్నారు. వెలుగు కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై బుధవారం సమీ క్షించారు. నెల రోజులపాటు జరిగే కార్యక్రమంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ముందుగా చెత్తను సేకరించడానికి వాహనాలను సమకూర్చు కోవాలని, ప్రజల్లో చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరిగేలా అధికా రులు, కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ కె.జ్యోతి, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:39:25+05:30 IST