అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా... బాధ్యతలు స్వీకరించిన ‘ఎస్‌వీఆర్’

ABN , First Publish Date - 2021-12-23T23:11:51+05:30 IST

అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా నియమితుడైన తెలుగోడు... ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌ రెడ్డి) బాధ్యతలు స్వీకరించారు. గురువారం జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ పురస్కారంతోపాటు, పదవీబాధ్యతలను స్వీకరించారు.

అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా... బాధ్యతలు స్వీకరించిన ‘ఎస్‌వీఆర్’

హైదరాబాద్ : అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా నియమితుడైన తెలుగోడు... ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌ రెడ్డి) బాధ్యతలు స్వీకరించారు. గురువారం జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ పురస్కారంతోపాటు, పదవీబాధ్యతలను స్వీకరించారు.  కాగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవానికి ఎంపికైన మొట్టమొదటి ప్రముఖుడు ఎస్‌వీఆర్ కావడం విశేషం. ఫ్లోరిడా(అమెరికా)లోని వరల్డ్ హ్యుమానిటీ కమిషన్(భారత్) ఈ గౌరవాన్ని ప్రకటించిన విషఫయం తెలిసిందే. సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలకు సంబంధించి ఎస్‌వీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరుకు చెందిన ఎస్‌వీఆర్... దేశవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల తరపునే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఎస్‌వీఆర్... సామాజిక సేవలనందిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా... ఇతరత్రా ఎటువంటి విరాళాలనూ స్వీకరించకుండా, సొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమాలను ఎస్‌వీఆర్ నిర్వహిస్తూండడం గమనార్హం. 


ఇదిలా ఉంటే... తమతో కలిసి పనిచేయాల్సిందిగా ఎస్‌వీఆర్‌ను పలు అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానిస్తుండడం గమనార్హం. కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకునిగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే క్రియాశీల బాధ్యతలను నిర్వర్విస్తోన్న ఎస్‌వీఆర్‌ను... ఇదే క్రమంలో... జాతీయస్థాయిలో ఓ ప్రముఖ సంస్థ కు సారధ్య బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. కాగా... అంతర్జాతీయ శాంతి రాయబారిగా నియమితుడైన ఎస్‌వీఆర్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. 

Updated Date - 2021-12-23T23:11:51+05:30 IST