Abn logo
Jun 6 2020 @ 08:17AM

ఎస్‌.వి.కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌..?

90వ ద‌శ‌కంలో య‌మ‌లీల‌, రాజేంద్రుడు గ‌జేంద్రుడు, మాయ‌లోడు, వినోదం, ఆహ్వానం, శుభ‌ల‌గ్నం ఇలా 40కి పైగా అద్భుత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఈ చివ‌రిసారి తెర‌కెక్కించిన చిత్రం ‘య‌మ‌లీల 2’. ఈ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత ఎస్‌.వి.కృష్ణారెడ్డి మెగాఫోన్ ప‌ట్ట‌లేదు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. అంతా ఓకే అయిన త‌ర్వాతే వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై కృష్ణారెడ్డి స్పందిస్తారేమో చూడాలి. అలాగే ఒక‌వేళ ఈ వార్త నిజ‌మైతే జ‌న‌రేష‌న్ చాలా మారింది. మ‌రి ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement