మోల్నుపిరావిర్‌, 2-డీజీ తయారీకి సువెన్‌ ఫార్మా ఒప్పందం

ABN , First Publish Date - 2021-06-11T07:43:01+05:30 IST

కొవిడ్‌ చికిత్సకు వినియోగించే మోల్నుపిరావిర్‌, 2-డీజీ ఔషధాల ప్రాసెస్‌ టెక్నాలజీ బదిలీ, తయారీకి సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ...

మోల్నుపిరావిర్‌, 2-డీజీ తయారీకి సువెన్‌ ఫార్మా ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): కొవిడ్‌ చికిత్సకు వినియోగించే మోల్నుపిరావిర్‌, 2-డీజీ ఔషధాల ప్రాసెస్‌ టెక్నాలజీ బదిలీ, తయారీకి సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), తిరువనంతపురానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎ్‌సటీ) మధ్య ఒప్పందం కుదిరింది. మోల్నుపిరావిర్‌కు చెందిన సింథటిక్‌ ప్రాసె్‌సను ఎన్‌ఐఐఎ్‌సటీ అభివృద్ధి చేసింది. ఈ ప్రాసె్‌సను ఐఐసీటీ మరింత అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని సువెన్‌ ఫార్మాకు బదిలీ చేస్తారు. సువెన్‌ ఫార్మా ఔషధాన్ని తయారు చేసి దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కొవిడ్‌ రోగులకు చికిత్స చేయడానికి, వారికి ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గించడానికి అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం టెక్నాలజీని కూడా సువెన్‌ ఫార్మాకు ఐఐసీటీ బదిలీ చేస్తుంది. దీన్ని కూడా కంపెనీ తయారు చేస్తుంది.  


Updated Date - 2021-06-11T07:43:01+05:30 IST