Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో వైరల్

ఇండియానా (అమెరికా): సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే అయ్యో అంటారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రమాదాన్ని చూసిన వారు ‘అరే.. ఇలా ఎలా?’ అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ‘వైరల్‌హాగ్’ అనే యూట్యూబ్ చానల్‌లో పోస్టు అయింది.


రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం ఎంత మూర్ఖత్వమే చెప్పే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతోంది. రెడ్ సిగ్నల్ పడడంతో జీబ్రా లైన్స్ వద్ద ఆగిన కారులో ఉన్న కెమెరాలో ఈ వీడియో రికార్డైంది. 


అక్టోబరు 17న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాలమైన చౌరాస్తాలో రెడ్‌లైన్‌ను పట్టించుకోకుండా అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీని అంతే వేగంతో వెళ్తున్న మరో కారు ఢీకొట్టింది.


అదే సమయంలో జీబ్రాలైన్ క్రాస్ చేసిన ఓ పాదచారి క్షణాల్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కారు ఢీకొట్టడంతో దూసుకెళ్లిన ఎస్‌యూవీ మరో వైపు నుంచి వస్తున్న ఇంకో కారుపైకి ఎక్కడం, ఆ కారు అలాగే వచ్చి జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఈ ఘటనలో మొత్తం ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఈ ప్రమాదంపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement