ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో సుస్థిరమైన కెరీర్‌ ఇదే..

ABN , First Publish Date - 2022-05-14T18:26:55+05:30 IST

ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో సుస్థిరమైన కెరీర్‌ అంటే రెండు దశాబ్దాల క్రితం ఎవరూ పెద్దగా గుర్తించలేదు, ఊహించనూలేదు. మళ్ళీ అందులో గేమింగ్‌ అంటే మరింత అనుమానాస్పదంగానే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే గేమింగ్‌ ప్రపంచంలో తమదైన అడుగుల కోసం పలు భారతీయ..

ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో సుస్థిరమైన కెరీర్‌ ఇదే..

ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో సుస్థిరమైన కెరీర్‌ అంటే రెండు దశాబ్దాల క్రితం ఎవరూ పెద్దగా గుర్తించలేదు, ఊహించనూలేదు.  మళ్ళీ అందులో గేమింగ్‌ అంటే మరింత అనుమానాస్పదంగానే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే గేమింగ్‌ ప్రపంచంలో తమదైన అడుగుల కోసం పలు భారతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. మరోవిషయం, గేమింగ్‌లో ఇప్పటికీ సాధిస్తున్న ఆదాయం అంతంతమాత్రం, భవిష్యత్తు విషయమై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో గేమింగ్‌ కెరీర్‌ ఎలా ఉంటుందో చూద్దాం. 


గేమింగ్‌ ఇండస్ట్రీ ఈ రోజు చూసుకుంటే వృద్ధిపథంలో ఉంది. ఇండియన్‌ మార్కెట్‌లో 2020 నాటికి 1.89 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉన్న గేమింగ్‌, 2026 నాటికి 4.01 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. చక్రీయ వార్షిక వృద్ధి రేటును 16.22 శాతంగా లెక్కకట్టారు. అదే గ్లోబల్‌ విషయానికి వస్తే 2020 నాటికి 173.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్న గేమింగ్‌ పరిశ్రమ 2026 నాటికి 314.4 బిలియన్‌ డాలర్లుగా అంటే చక్రీయ వార్షిక వడ్డీ రేటును 9.64 శాతంగా అంచనా వేస్తున్నారు. 


ఇప్పటికీ గేమింగ్‌ అంటే ఫన్‌. టీమ్‌లోని పాత్రలతో సంబంధం లేదు. కేవలం క్రీడాకారుడిని ఆటలో ఆసాంతం కూర్చోబెట్టడం, అందులో ఆనందాన్ని కలుగజేయడం గేమ్‌ లక్ష్యం కావాలి.  ఆ క్రమంలో మరిన్ని గేమ్‌లను యూజర్లు ఆడేలా ప్రోత్సహించాలి. ఎక్స్‌పీరియెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ డెవలపర్లు గేమ్స్‌ను రెప్లికేట్‌ చేస్తూ ఉండాలి. ఆటలో యూనిక్‌నెస్‌ కోసం మొండి పట్టుదల అంతకుమించి క్రియేటివిటీతో కృషి చేసిన వారిని గేమింగ్‌ అక్కున చేర్చుకుటుంది.  సవాళ్ళను అధిగమించినప్పుడే యూనిక్‌నెస్‌ని మెయింటైన్‌ చేయవచ్చు. ప్లేయర్‌ కోరుకునే గేమ్‌ను అందించేలా సన్నద్ధం చేయవచ్చు.  పదేపదే ప్రాక్టీస్‌ చేయడం ద్వారా అన్ని అవరోధాలను అధిగమించడమే కాదు, ప్లేయర్‌కు అవసరమైన క్రీడను రూపొందించే నైపుణ్యాలు అభివృద్ధి చెందేందుకు ఆ కృషి  తోడ్పడుతుంది. 


అవకాశాలు

మంచి క్రీడ రూపొందాలంటే బహుముఖ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల బృందం అవసరమవుతుంది. ఎంపిక చేసుకున్న గేమ్‌ను అనుసరించి బ్యాక్‌ ఎండ్‌ - ఫ్రంట్‌ ఎండ్‌ రూపకల్పనకు ఇంజనీర్లతో మొదలుకుని ఆర్టిస్టులు, యానిమేటర్లు, గేమ్‌ డిజైనర్లు, గేమ్‌ప్లే, యుఎక్స్‌ డిజైనర్లు, ప్రొడక్టు మేనేజర్లు, అనలిస్టులు, క్వాలిటీ అస్యూరెన్స్‌ బృందం, ప్లేయర్లకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, క్వాలిటీ అస్యూరెన్స్‌ టీమ్‌ సహా పలువురు నిపుణులు అవసరమవుతారు. ఇంజనీరింగ్‌ నేపథ్యం అవసరమైనప్పటికీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌కు తోడు ఫైన్‌ ఆర్ట్స్‌లో అర్హతలు అభిలషణీయం తప్పనిసరి కానప్పటికీ గేమింగ్‌ ఎక్స్‌పోజర్‌ ఉండటం చాలా మంచిది. ఇందులో మళ్ళీ కొన్ని కెరీర్ల స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయంటే....


గేమ్‌ యానిమేటర్‌: గ్రాఫిక్స్‌, యానిమేషన్స్‌ మాత్రమే ఒక గేమ్‌ను మరో శిఖరం పైకి తీసుకెళతాయి. గేమ్‌ యానిమేటర్లు మాత్రమే డిజైన్‌, యానిమేట్‌, రీ-క్రియేట్‌ గేమ్‌ కేరక్టర్స్‌, ఆబెకుక్టును రూపొందించగలుగుతారు. టెక్నాలజీ, ఆర్ట్‌ను కలిపి వీడియో గేమ్స్‌ కోసం వీరు ఇంటరాక్టెడ్‌ యానిమేటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించగలుగుతారు. 


గేమ్‌ ప్రొడ్యూసర్‌: గేమ్‌ ప్లానింగ్‌, కోఆర్డినేషన్‌, పర్యవేక్షణ తదితర కార్యకలాపాలు ఈ వ్యక్తి పరిధిలోకి వస్తాయి. ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, మేనేజర్ల బృందంలో సభ్యుడిగా ఉంటారు. అంటే  సదరు వ్యవహారాలు అన్నింటిలో పాలుపంచుకుంటారు. షెడ్యూలింగ్‌ నుంచి బడ్జెటింగ్‌, డెవలపింగ్‌, ఎడిటింగ్‌, లైసెన్సింగ్‌ సహా వివిధ పనుల్లో ఉండి గేమ్‌ ఒక రూపునకు చేరుకునేందుకు ఇతోధిక కృషి చేస్తారు. 


ఆడియో ఇంజనీర్‌: ఆడియో క్వాలిటీని బట్టే ఒక గేమ్‌ లుక్‌, గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ తదితరాలు అన్నీ ఉంటాయి. గేమ్‌ సౌండ్‌ ట్రాక్‌ యావత్తు ఆడియో ఇంజనీర్‌ చేతిలో ఉంటుంది. వాయిస్‌ ఓవర్‌, యాంబియెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ తదితరాలన్నీ గేమ్‌ విలువను పెంచేవే.


క్రియేటివ్‌ డైరెక్టర్‌: గేమ్‌ లుక్‌, ఫీల్‌ వంటి విషయాలు క్రియేటివ్‌ డైరెక్టర్‌ చేతిలో ఉంటాయి. గేమ్‌కు సంబంధించి అన్ని కోణాలపై నియంత్రణ ఈ వ్యక్తి చేతిలో ఉంటాయి. గేమ్‌ప్లే, ఆడియో - విజువల్‌ స్టయిల్‌, కథనం నుంచి మార్కెటింగ్‌ వరకు అన్నీ చూసుకోవాలి. గేమింగ్‌ ఇండస్ట్రీ అంటే అందులో ఎక్కువ మంది ఔత్సాహికుల మదిని దోచే వృత్తి క్రియేటివ్‌ డైరెక్టర్‌.


గేమ్‌ డిజైనర్‌: నేరేటివ్‌ ఫీచర్స్‌, స్టోరీ లైన్‌ డిజైనింగ్‌, కేరెక్టర్‌బయో తదిరాలన్నీ చూడాలి. చూపరులను ఆకట్టుకునే విధంగా కేరెక్టర్లు, గ్రాఫిక్స్‌, టూల్స్‌, వెపన్స్‌ రూపకల్పనలో పాలుపంచుకోవాలి. ఆటను మెరుగుపర్చడం అదేవిధంగా కలర్‌ మార్పు వంటివాటిపై కూడా దృష్టి పెట్టాలి. గేమ్‌ డెవలపర్‌తో పోల్చుకుంటే డిజైనర్‌కు వేతనం తక్కువగానే ఉంటుంది.


గేమ్‌ ప్రోగ్రామర్‌: వీడియోకు కోడ్‌ బేసె్‌సను అభివృద్ధిపర్చడంలో గేమ్‌ ప్రోగ్రామర్లు సహాయపడతారు. గేమ్‌ డెవల్‌పమెంట్‌ టూల్స్‌, గేమింగ్‌ ప్రోగ్రామ్స్‌లో వీరికి పని ఉంటుంది. కోడింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ పనిలో వీరు సాధారణంగా ఉంటారు. గేమింగ్‌ను కెరీర్‌గా  ఎంచుకునే వారిలో ఇది కూడా ఒక మంచి ఛాయిస్‌గా భావిస్తారు.


గేమ్‌ ఆర్టిస్ట్‌: త్రీడైమన్షన్‌ కేరెక్టర్లు, ఇతర గ్రాపిక్స్‌లో వీరికి పని ఎక్కువగా ఉంటుంది. వీడియో గేమ్‌లోని విజువల్‌ ఎలిమెంట్స్‌ అన్నింటికీ 2డి, 3డి ఆర్ట్‌ను క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. కేరెక్టర్లు, వెహికల్స్‌, నేపథ్యాలు, ఆబ్జెక్ట్స్‌, టెక్స్‌ట్యూర్స్‌, క్లోతింగ్‌, కలరింగ్‌ పనులు ఉంటాయి. ప్రాథమికంగా వీరు విజువల్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు బాధ్యత వహిస్తారు.


లీడ్‌ ఆర్టిస్టు: గేమ్‌లో ఒరిజినల్‌, ఇన్నోవేటివ్‌ ఆర్ట్‌ స్టయిల్‌లో - లీడ్‌ ఆర్టిస్ట్‌ కీలకపాత్ర పోషిస్తారు. గేమ్‌ సాంకేతిక, సౌందర్య అంశాలన్నింటిలో పని ఉంటుంది. ఇంటర్‌ఫేస్‌ డిజైనింగ్‌, యూజబిలిటీ తదితరాలపైనా పనిచేస్తారు. క్రియేటివిటీ, టెక్నికాలిటీస్‌ ఆసక్తికర అంశాలైతే చాలు, ఈ పోస్టును అందుకోవచ్చు. 


రైటర్‌: స్క్రీప్ట్‌ రైటింగ్‌, కథనం, స్టోరీ లైన్‌, మాటలు, ఇతర టెక్నికల్‌ రైటింగ్స్‌ అన్నింటిలో రైటర్‌ పాత్ర ఉంటుంది. యూనిక్‌ కేరెక్టర్లకు రూపకల్పనతోపాటు స్ర్కీన్‌ప్లేపై పట్టు సాధించి ఉండాలి. భిన్న పాత్రల క్రియేషనే కాదు, వాటిని ఆటలో ఒప్పించాలి. అందుకు క్రియేటివిటీ చాలా అవసరం. 

గేమ్‌ టెస్టర్‌: ప్రొఫెషనల్‌ గేమర్‌కు గేమ్‌ టెస్టర్‌కు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆడటమే కాదు, ఒక ఆటను అన్ని స్థాయుల్లో పరీక్షించగలగాలి. తప్పులు లేదంటే లోపాలకు అతీతంగా ఒక గేమ్‌ అని తేల్చాలి. గేమింగ్‌ ఇండస్ట్రీలో భాగం కాగలిగినప్పుడే ఈ విధిని జాగ్రత్తగా నిర్వర్తించగలుగుతారు.


కోర్సులు

గేమింగ్‌లో వాస్తవానికి సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌ డిప్లొమా కోర్సులను వివిధ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. బీఎస్సీ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌

బీఎస్సీ ఇన్‌ గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ 

బీఏ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ 

బీఏ ఇన్‌ డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ అండ్‌ యానిమేషన్‌

బీఎస్సీ ఇన్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ 

మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ గేమ్‌ టెక్నాలజీ

ఎంఎప్‌ఏ ఇన్‌ గేమ్‌ డిజైఎంఏ ఇన్‌ ఇంటరాక్టివ్‌ డిజైన్‌ అండ్‌ గేమ్‌ డెవల్‌పమెంట్‌

ఎమ్మెస్సీ ఇన్‌ మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఇన్‌ మల్టీ మీడియా అండ్‌ యానిమేషన్‌ విత్‌ గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌


వివిధ కోర్సులను ఆఫర్‌ చేస్తున్న ప్రముఖ దేశీ, విదేశీ విద్యాసంస్థలు

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ గేమింగ్‌

ఎరీనా యానిమేషన్‌ ఐసీఏటీ కాలేజ్‌

బాక్‌స్టేజ్‌ పాస్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ అండ్‌ టెక్నాలజీ

మాయా అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్స్‌ 

ద యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా

రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా 

సదరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీ 

కార్నెగి మెలన్‌ యూనివర్సిటీ



Read more