Abn logo
Sep 17 2020 @ 09:27AM

నన్ను వదిలేసిన వారి కోసం ఏడవను: స్టార్ హీరో మాజీ భార్య కామెంట్

తనను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవనని, వారి గురించి ఆలోచిస్తూ ఒక్క రోజును కూడా వృథా చేయనని బాలీవుడ్ స్టార్ హీరో హృతిరోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. 2014లో హృతిక్ నుంచి సుసానే విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పిల్లల కోసం మాత్రం వీరిద్దరూ తరచుగా కలుస్తుంటారు. 


లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసించారు. ఈ నేపథ్యంలో సుసానే తాజా కామెంట్ వైరల్ అవుతోంది. నీలిరంగు కోట్, ఫార్మల్ వేర్ ధరించి బిజినెస్ ఉమెన్ లుక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసిన సుసానే.. `నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను` అంటూ కామెంట్ చేసింది. 



Advertisement
Advertisement
Advertisement