Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 27 2021 @ 19:12PM

కర్నూలు జిల్లాలో నవ వధువు అనుమానాస్పద మృతి

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో సుజాత అనే నవ వధువు అనుమానాస్పదస్థితలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే కల్లుదేవకుంటకు చెందిన భీమేష్‌తో గొల్లలదొడ్డికి చెందిన సుజాతకు వివాహం జరిగింది. సుజాత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు హాస్పెటల్‌కి తీసుకువచ్చారు. సుజాతను భర్త, అత్తామామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. సుజాత భర్త పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Advertisement
Advertisement