కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-07-31T23:27:48+05:30 IST

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. అసభ్య

కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

కృష్ణా: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. అసభ్య ప్రవర్తన కలిగిన కానిస్టేబుల్  CH. V. రామకృష్ణ( P. C.750) పై సస్పెన్షన్ విధిస్తూ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. గంపలగూడెం పోలీస్ స్టేషన్లో రామకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నాడు. చెక్‌పోస్ట్ వద్ద విధులకు కొంతకాలంగా గైర్హాజరవుతున్నాడు.  గ్రామ  మహిళ వీఆర్‌వో, ఆమె తల్లి పట్ల రామకృష్ణ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులపాలు చేసాడు. దీంతో కానిస్టేబుల్‌పై పూర్తి విచారణ చేసి రామకృష్ణను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసారు. 


Updated Date - 2021-07-31T23:27:48+05:30 IST