ఏఎన్‌ఎంలపై సస్పెన్షన్‌ ఎత్తి వేయాలి

ABN , First Publish Date - 2021-10-21T06:22:01+05:30 IST

కోనరావుపేట మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎన్‌ఎంలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆశావర్కర్లు డిమాండ్‌ చేశారు.

ఏఎన్‌ఎంలపై సస్పెన్షన్‌ ఎత్తి వేయాలి
కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఆశావర్కర్లు

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 20: కోనరావుపేట మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎన్‌ఎంలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆశావర్కర్లు డిమాండ్‌ చేశారు.  బుధవారం   ఆశావర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు సరోజ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనరావుపేట మండలంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో  ఏఎన్‌ఎంలు సంపూర్ణ, కవితను సస్పెండ్‌ చేశారని,   పని ఒత్తిడితో అన్‌లైన్‌ డేటాలో తప్పుడు రికార్డులు నమోదయ్యాయని పేర్కొన్నారు.  అంతకుముందు  కలెక్టరేట్‌ గేటు వద్ద ఆశార్కర్లను పోలీసులు  అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పినా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని కలిసి వినతిపత్రం అందజేశారు.   అశావర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:22:01+05:30 IST