మహిళా సంరక్షణా కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-06T05:21:10+05:30 IST

ఎచ్చెర్ల మండలం సంతసీతారాం పురం మహిళా సంరక్షణా కార్యదర్శి, డ్రాయింగ్‌, డిస్పర్శింగ్‌ పంచాయతీ కార్య దర్శిని సస్పెన్షన్‌ చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన జారీచేశారు.

మహిళా సంరక్షణా కార్యదర్శి సస్పెన్షన్‌

 ఇద్దరిపై ఫోర్జరీ కేసు 

 ఈఓఆర్డీ, ఎంపీడీవోలకు షోకాజ్‌ నోటీసులు 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు5: ఎచ్చెర్ల మండలం సంతసీతారాం పురం మహిళా సంరక్షణా కార్యదర్శి, డ్రాయింగ్‌, డిస్పర్శింగ్‌ పంచాయతీ కార్య దర్శిని సస్పెన్షన్‌ చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన జారీచేశారు. ‘సంతసీతారాంపురం మహిళా సంరక్షణా కార్యదర్శి(పోలీసు) విధులకు గైర్హాజరు అవుతున్నట్లు విచారణలో వెల్ల డైంది. కార్యాలయానికి గైర్హాజరు కావడమే కాకుండా ఇంటి వద్ద నుంచే బయో మెట్రిక్‌ హాజరు వేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఇందుకు డ్రాయింగ్‌, డిస్పర్శింగ్‌ పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వారిద్దరిపై ఫోర్జరీ కేసు నమోదుతోపాటు సస్పెన్షన్‌ చేశామని తెలిపారు. గ్రామ సచివాలయ నిర్వహణ పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు గ్రామీణ అభి వృద్ధి కార్యనిర్వాహణ అధికారి(ఈఓఆర్డీ)కి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని జేసీ ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-06T05:21:10+05:30 IST