Abn logo
Oct 25 2021 @ 01:02AM

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన

అనంతపురం క్రైం, అక్టోబరు 24: జిల్లా పోలీసు శాఖలోని ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ డాక్టర్‌  ఫక్కీ రప్ప సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌ పోలీసుస్టేషనలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ హర్షవర్ధనరాజుకు బ్రహ్మసముద్రం గ్రామానికి చెం దిన ఓ యువతితో గత ఏడాది వివాహమైంది. ఆ కానిస్టేబుల్‌కు వివా హం జరగకముందు నుంచే అదేశాఖ ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది. వివాహమైన తర్వాత హర్షవర్ధనరాజు ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట బాధిత మహిళ తన భర్త ప్రవర్తన తీరు, అత్తమామల వేధింపులపై బ్ర హ్మస ముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసు లు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు అనంతరం సమగ్ర నివేదిక ను జిల్లా ఎస్పీకి అందజేశారు. ఈక్రమంలో  జిల్లా ఎస్పీ సివిల్‌ కానిస్టేబుల్‌ హర్షవర్ధనరాజుతో పాటు ఏఆర్‌ మహి ళా కానిస్టేబుల్‌ను శాఖపరమైన చర్యలలో భాగంగా స స్పెండ్‌ చేశారు. బాధితురాలి అత్తమామలపై కూ డా కేసు నమోదు చేసినట్లు సమాచారం.