డీసీసీబీ ఉద్యోగినిపై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2021-04-23T06:42:39+05:30 IST

జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) ఏటీఎంలో నగ దు స్వాహా వ్యవహారానికి సంబంధించి కాణిపాకం బ్రాంచిలో స్టాప్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాందిని సుల్తానీ అనే మహిళా ఉద్యోగిని సస్పెండ్‌ చేసినట్లు బ్యాంకు సీఈవో మనోహర్‌గౌడ్‌ తెలిపారు.

డీసీసీబీ ఉద్యోగినిపై సస్పెన్షన్‌ వేటు

స్వాహా చేసిన నిధుల రికవరీ


చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22: జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) ఏటీఎంలో నగ దు స్వాహా వ్యవహారానికి సంబంధించి కాణిపాకం బ్రాంచిలో స్టాప్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాందిని సుల్తానీ అనే మహిళా ఉద్యోగిని సస్పెండ్‌ చేసినట్లు బ్యాంకు సీఈవో మనోహర్‌గౌడ్‌ తెలిపారు. ఆమె నుంచి  రూ. 6.25 లక్షలను రికవరీ చేసి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ఆమె గతంలో పనిచేసిన శాఖల్లో కూడా ఇంటర్నల్‌ తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2021-04-23T06:42:39+05:30 IST