PUBG కోసం తల్లిని చంపిన కొడుకు కేసులో షాకింగ్ ట్విస్ట్.. తెరపైకి మరో వ్యక్తి పేరు..!

ABN , First Publish Date - 2022-06-13T18:17:09+05:30 IST

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో లక్నోకు చెందిన 16 ఏళ్ల బాలుడు తల్లి ప్రాణాలు తీసిన ఘటనకు సంబంధించిన విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది.

PUBG కోసం తల్లిని చంపిన కొడుకు కేసులో షాకింగ్ ట్విస్ట్.. తెరపైకి మరో వ్యక్తి పేరు..!

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో లక్నోకు చెందిన 16 ఏళ్ల బాలుడు తల్లి ప్రాణాలు తీసిన ఘటనకు సంబంధించిన విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ బాలుడు కాకుండా మరో వ్యక్తి కూడా హత్య జరిగిన సమయంలో లోపల ఉన్నాడేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. తిండి, నిద్ర మాని నిరంతరం గేమ్ ఆడుతున్న 16 ఏళ్ల కొడుకుని తల్లి పలుమార్లు మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు ఇంట్లో ఉన్న తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్తో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఆమెపై కాల్పులు జరిపాడు. తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు వదిలింది. హత్య అనంతరం సదరు బాలుడు తల్లి శవాన్ని మూడ్రోజులు ఇంట్లోనే దాచిపెట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తొమ్మిదేళ్ల చెల్లెలిని బెదిరించాడు. 


ఇది కూడా చదవండి..

చెల్లి చనిపోయిందని ఫోన్‌కాల్.. 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం.. సోదరి చితిమంటలపైనే దూకేసిన అన్న..!


ఆ మూడ్రోజులు బాలుడు ఎవరితో మాట్లాడాడనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో బాలుడి తండ్రి, ఆర్మీ అధికారి నవీన్‌ ప్రమేయం కూడా ఉందేమోనని అనుమానిస్తున్నారు. భార్య హత్య విషయం తెలిసిన వెంటనే నవీన్ పోలీసులకు కాకుండా తన బంధువులకు విషయం చెప్పాడు. వారిని ఇంటికి పంపించాడు. దీంతో పోలీసులు నవీన్‌ను కూడా అనుమానిస్తున్నారు. అలాగే బాలుడు ఇస్తున్న స్టేట్‌మెంట్లు కూడా గందరగోళంగా ఉన్నాయి. పిస్టల్‌లో బుల్లెట్లు లోడ్ చేసి ఉండడం, ఆ పిస్టల్ కింద కప్‌బోర్డ్‌లోనే ఉండడం, హత్య తర్వాత భయపడకుండా బాలుడు ఇంట్లోనే ఉండడం పోలీసులకు అనుమానం కలిగిస్తున్నాయి. దీంతో పోలీసులు మరింత కఠినంగా విచారిస్తున్నారు. 


హత్య జరిగిన తర్వాత మృతదేహం నుంచి వాసన రాకుండా ఆ బాలుడు రూం ఫ్రెషనర్ ఉపయోగించాడు. మూడ్రోజులుగా భార్య ఫోన్లో మాట్లాడకపోవడంతో బెంగాల్‌లో విధులు నిర్వరిస్తున్న భర్త నవీన్‌కు అనుమానం కలిగింది. కొడుకును అడిగితే.. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ తల్లిని కాల్చి చంపాడని కట్టుకథ వినిపించాడు. పోలీసులకు కూడా మొదట అలాగే చెప్పాడు. ఆ తర్వాత మాట మార్చాడు. పోలీసులు ప్రస్తుతం ఆ బాలుణ్ని, హతురాలి భర్తను, బంధువులను విచారిస్తున్నారు. 

Updated Date - 2022-06-13T18:17:09+05:30 IST