జగన ప్రభుత్వాన్ని సాగనంపండి: కాలవ

ABN , First Publish Date - 2022-09-27T05:29:00+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న జగన ప్రభుత్వాన్ని సాగనంపాలని, జనరం జక పాలన అందించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు.

జగన ప్రభుత్వాన్ని సాగనంపండి: కాలవ
కొండాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ మంత్రి కాలవ

రాయదుర్గం రూరల్‌, సెప్టెంబరు 26 : ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న జగన ప్రభుత్వాన్ని సాగనంపాలని, జనరం జక పాలన అందించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండలంలోని కొండాపురం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మారెంపల్లి క్రాస్‌కు టీడీపీ నాయకులు పెద్దఎత్తున చేరుకుని కాలవ శ్రీనివాసులుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొండాపురం వరకు ద్విచక్ర వాహనంపై ర్యాలీ నిర్వహించారు. అనం తరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను ఎండగడుతూ కరపత్రాల ను పంపిణీ చేశారు. ధరలు తగ్గాలంటే జగనను సాగనంపాలన్నారు. మూడేళ్లలో నిత్యావసర సరుకుల నుంచి డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. కావ ున మరొకసారి తెలుగుదేశం పార్టీని గెలిపిం చుకుని నారా చంద్రబాబునా యుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగన పాలనలో అన్ని వర్గాల వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపా రు. పాలన అందించడంలో జగన ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంద న్నారు.  కార్యక్రమంలో మండల కన్వీనర్‌ హ నుమంతు, టీడీపీ నాయకులు పోట్ల రవి, హనుమంతు, రామ్మూర్తి, నాగరాజు, సోమ శేఖర్‌, గిరిధర్‌ నాయుడు, లక్ష్మణ్ణ, బంగి శంకర్‌, వీరష్‌స్వామి, ప్రసాద్‌, ఓబ య్య, తిమ్మారెడ్డి, సర్పంచ అశోక్‌ పాల్గొన్నారు.  

రాయదుర్గంటౌన: పట్టణంలోని 32వ వార్డులో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కాలవ శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పాలనలో మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో 32వ వార్డు ఇనఛార్జి రావూత రాజశేఖర్‌, జిల్లా అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్‌, రాష్ట్రమాజీ చేనేత డైరెక్టర్‌ టంకశాల హనుమంతు, కౌన్సిలర్లు జ్యోతి, ప్రశాంతి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బండి భారతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇనాయత, బీసీ సెల్‌ నాయకులు పొరాళ్లు ధనార్జున, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జమీల్‌ఖాన  పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T05:29:00+05:30 IST