Munugode : సస్పెన్స్‌కు తెర.. సెంటిమెంటుకే ఓటు

ABN , First Publish Date - 2022-10-06T18:32:18+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode bypoll)లో టీఆర్ఎస్ (TRS) పేరుతోనే పోటీ చేయనున్నట్టు తెలంగాణ ప్రణాళికా

Munugode : సస్పెన్స్‌కు తెర.. సెంటిమెంటుకే ఓటు

నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక (Munugode bypoll)లో టీఆర్ఎస్ (TRS) పేరుతోనే పోటీ చేయనున్నట్టు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ (Central election commission) అధికారులను కలిసిన తరువాత వినోద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించడానికి కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. రేపటి నుంచే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. పార్టీ ఎన్నికల గుర్తు కారే ఉంటుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అందులో ఎటువంటి మార్పూ ఉండదన్నారు. వ్యక్తి పేరు మార్చినట్లే పార్టీ పేరు మార్చామన్నారు. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయన్నారు. బీఆర్ఎస్‌ను ఎన్నికల కమిషన్ గుర్తించేంత వరకూ టీఆర్ఎస్ పేరే కొనసాగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ బీఆర్ఎస్‌తో ముందుకు సాగుతారా? లేదంటే టీఆర్ఎస్‌తోనా? అనే సస్పెన్స్‌కు తెర వీడింది. మొత్తానికి కారణాలేమైతేనేమి సెంటిమెంటుకే ఓటు పడింది.

Updated Date - 2022-10-06T18:32:18+05:30 IST