Abn logo
Sep 21 2020 @ 03:05AM

కొడవలితో భార్య కడుపు కోసేశాడు!

Kaakateeya

  • ఆరోసారీ ఆడపిల్ల పుడుతుందన్న అనుమానంతో యూపీలో దారుణం 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఐదుగురు ఆడపిల్లలు.. మగపిల్లాడు పుట్టాలని కోరుకుంటున్న ఆ తండ్రి.. ఆరోసారి తనకు పుట్టబోయేది ఆడ, మగ అనేది నిర్ధారించుకోవడానికి దారుణానికి ఒడిగట్టాడు. ఏడు నెలల గర్భవతి అయిన తన భార్య కడుపును కొడవలితో కోశాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది. కూలి పని చేసుకొని జీవించే పన్నాలాల్‌ (43)కు ఐదుగురు ఆడపిల్లలు.


భార్య అనితాదేవి(40) ప్రస్తుతం గర్భవతి. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన పన్నాలాల్‌ భార్యతో గొడవపడ్డాడు. ఆరోసారి కూడా ఆడపిల్లే పుడుతుందేమోనన్న భయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో కడుపును కొడవలితో కోశాడు. అనిత బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో పన్నాలాల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement