పండుగ రోజు ఇంత పొద్దెక్కినా ఇంటి తలుపులు తీయలేదేంటని పక్కింటోళ్లకు అనుమానం.. పిలిచినా ఎవరూ పలకకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-05T23:29:47+05:30 IST

పండగ రోజు ఎవరి ఇల్లు అయినా సందడిగా ఉంటుంది. ఉదయాన్నే లేచి, స్నానాలు చేసి, పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీపావళి రోజు.. అందులోనూ వ్యాపారులకు ఈ పూజ కార్యక్రమాలు ఎక్కువగానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కా

పండుగ రోజు ఇంత పొద్దెక్కినా ఇంటి తలుపులు తీయలేదేంటని పక్కింటోళ్లకు అనుమానం.. పిలిచినా ఎవరూ పలకకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: పండగ రోజు ఎవరి ఇల్లు అయినా సందడిగా ఉంటుంది. ఉదయాన్నే లేచి, స్నానాలు చేసి, పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీపావళి రోజు.. అందులోనూ వ్యాపారులకు ఈ పూజ కార్యక్రమాలు ఎక్కువగానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రతి రోజు ఉదయన్నె నిద్రలేచి, అన్ని కార్యక్రమాలు ముగించుకుని షాపు తీసే వ్యక్తి.. ఆ రోజు మాత్రం దుకాణంను ఓపెన్ చేయలేదు. పండగ వేళ పొద్దెక్కినా ఆయన ఇంటి తలుపులు మూసినవి మూసినట్టుగానే ఉన్నాయి. ఈ క్రమంలో చుట్టు పక్కన ఉన్న కొందరు స్థానికులు గుమ్మం దగ్గరకు వెళ్లి, ఆ వ్యాపారిని పిలిచారు. లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోడంతో అతడి భార్యను పిలిచారు. అయినప్పటికీ ఇంట్లో నుంచి ఉలుకూపలుకూ లేదు. దీంతో కిటికీలోంచి ఇంట్లోకి తొంగి చూశారు. అనంతరం ఇంట్లో కనిపించిన సీన్ చూసి వాళ్లు కంగుతిన్నారు. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. 



మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌‌కు చెందిన యోగేశ్‌కు సునీత అనే భార్యతో పాటు దివ్యాన్ష్ అనే 12ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇంటి దగ్గర ఆయనకు కిరాణా దుకాణంతోపాటు, పాన్ షాపు కూడా ఉంది. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం దుకాణాలు మూసేసి, అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత పడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఉదయమే లేచి, పాన్ షాప్‌ను ఓపెన్ చేసే యోగేశ్.. పండుగ వేళ మాత్రం షాప్ తీయలేదు. ఆయన భార్య కూడా కిరాణా దుకాణం తెరవకపోగా.. పొద్దెక్కినా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. దీంతో కొందరు స్థానికులు.. యోగేశ్ ఇంటి వద్దకు వెళ్లి పిలిచారు. లోపలి నుంచి స్పందన లేకపోవంతో అతడి భార్యను పిలిచారు. సేమ్ సీన్ రిపీట్ కావడంతో అసలు వీళ్లు ఇంట్లో ఏం చేస్తున్నారు. పండగ వేళ ఇంత మొద్దు నిద్ర ఏంటి అనుకుంటూ కిటికిలోంచి ఇంట్లోకి తొంగి చూశారు. 


ఈ క్రమంలో ఇంట్లో కనిపించిన సీన్ చూసి స్థానికులు షాకయ్యారు. రక్తం మడుగులో ముగ్గరూ పడి ఉంటాన్ని గమనించి కంగుతిన్నారు. వెంటనే విషయం పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసుటు ఘటన స్థలానికి చేరుకుని.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్లు అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చి చెప్పేశారు. ముగ్గురి తలలపై బలమైన గాయం కావడం వల్లే ప్రాణాలు వదలినట్టు డాక్టర్లు ప్రాథమికంగా వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 




Updated Date - 2021-11-05T23:29:47+05:30 IST