Abn logo
Nov 30 2020 @ 01:18AM

గోవిందపాలెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి!

రాంబిల్లి, నవంబరు 29 : మండలంలోని గోవిందపాలెం సమీపం కొబ్బరితోట వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందినట్టు రాంబిల్లి   ఏఎస్‌ఐ అప్పారావు తెలిపారు. తూ.గో. జిల్లా తొండంగి మండలం, కొత్తపేటకు చెందిన చవ్వాకుల జగదీశ్‌ (33) వాడనర్సాపురంలో ఉన్న తన  భార్యను చూసేందుకు ఈ నెల 27న వచ్చాడన్నారు. 28వ తేదీ సాయంత్రం ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం సేవించేందుకు  గోవిందపాలెం వచ్చినట్టు చెప్పారు. ఇతనితో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోయారన్నారు. జగదీశ్‌ మాత్రం మద్యం సేవిస్తూ  కొబ్బరి తోట వద్ద ఉండిపోయి మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement