Abn logo
Jul 8 2020 @ 17:19PM

చిత్ర నిర్మాణ‌ రంగంలో చిరు త‌న‌య సుస్మిత‌

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించారు సుస్మిత‌. అందులో భాగంగా వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు సుస్మిత‌. ఓయ్ సినిమాను డైరెక్ట్ చేసిన ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వ్య‌వ‌ధి 30 నుండి 40 నిమిషాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డ‌వుతుంద‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement