Abn logo
Sep 22 2021 @ 01:10AM

పోలీసు స్టేషన్‌లోనే యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం

అందరి సమక్షంలో పురుగుల మందు తాగిన వైనం

 కదిరి, సెప్టెంబరు 21: ప్రేమించిన వాడే పెళ్లికి నిరాకరించాడని మన స్తాపంతో ఓ యువతి పోలీసుస్టేషన్‌లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పట్టణంలోని రూరల్‌ సర్కిల్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్‌ సీఐ మధు విలే కరులకు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు తలుపుల మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌ లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ యువతి పెళ్ళి చేసుకోవాలని అడుగగా తాను పెళ్లి చేసుకోలేనని నిరాకరించాడు. ఈ విషయాన్ని తలుపుల పోలీసుస్టేషన్‌లో రెండు రోజుల కిందట బాధితురాలి తల్లిదండ్రులు ఎస్‌ఐ గాయత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఎస్‌ఐ ఇరువర్గాలతో మా ట్లాడి పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడికి చెప్పింది. తాను పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పేశాడు. ఎస్‌ఐ బాధితురాలి తల్లిదండ్రుల తో కూడా మాట్లాడింది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలి పింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తాము పై అధికారుల వద్దకు వెళ్ళి న్యాయం కోరతామని చెప్పి మంగళవారం రూరల్‌ సర్కిల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చా రు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు యువకుడి తల్లిదండ్రులు, బంధువులు అందరూ సీఐ వద్దకు వెళ్లారు. యువకుడు తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్థాపానికి గురైన బాధితురాలు అందరూ చూస్తుండగానే వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును తాగేసింది. ఇది గమనించిన పోలీసు లు, బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు పురుగుల మందును లాక్కొని హుటాహుటిన ఆసుప త్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడి పై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 మాజీ ఎమ్మెల్యే కందికుంట పరామర్శ 

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. దైర్యంగా ఉండాలని ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పారు.