ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-19T05:27:39+05:30 IST

ఒకే ఊరుకు చెందిన యువతి, యు వకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు తాము కలిసి ఉండేందుకు అంగీక రించరని పెళ్లి చేసుకుని.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్య

చెట్టుకు చీరతో  ఉరేసుకున్న ప్రేమజంట 


ముప్పాళ్ళ, జనవరి 18: ఒకే ఊరుకు చెందిన యువతి, యు వకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు తాము కలిసి ఉండేందుకు అంగీక రించరని పెళ్లి చేసుకుని.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన సోమ వారం మండలంలోని ఇరుకుపాలెం గ్రామ శివారులో జరిగింది. ఇందుకు సం బం ధించి పోలీసులు తెలిపిన వివరా లు.. సత్తెనపల్లి పట్టణం పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ప్రదీప్తి(17), యానాదికాలనీకి చెందిన కిరణ్‌కుమార్‌(22) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రదీప్తి 9వ తర గతి చదివేటప్పడు కిరణ్‌ కుమార్‌ ఇంటి మీదగా ట్యూషన్‌కు వెళ్లే క్రమంలో వారికి పరిచయం ఏర్ప డింది. దీంతో వీరిద్దరూ ప్రేమించు కున్నారు. ప్రస్తుతం ప్రదీప్తి హైదరా బాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతుంది. కరోనా కార ణంగా కళాశాల లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లో తర గతులకు హాజరవుతుంది. కిరణ్‌ కుమార్‌ రాజమండ్రిలో తాపీ మేస్ర్తి గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం తెలిసి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఆరు నెలల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో రాజమండ్రిలో ఉం టున్న కిరణ్‌కుమార్‌ గ్రామానికి వచ్చి ప్రదీప్తిని కలిసి సోమవారం పెళ్లి చేసు కున్నాడు. సోమవారం తెల్లవారుజాము వరకు కూడా ప్రదీప్తి ఇంట్లోనే ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. రాజ మండ్రిలో ఉంటున్న కిరణ్‌కుమార్‌ గ్రామానికి ఎప్పుడు వచ్చాడో తెలి యదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గ్రామ శివార్ల లోని ఓ చెట్టుకు ఒకే చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న ప్రేమికుల ను సోమవారం ఉదయం గ్రామస్థు లు గుర్తించారు. గ్రామస్థుల సమా చారంతో రూరల్‌ సీఐ నరసింహారావు, ముప్పాళ్ళ ఎస్‌ఐ నజీర్‌బేగ్‌ మృ తదేహాలను పరిశీలించారు. యు వతి మెడలోని తాళి బొట్టు ఆధారం గా వారు పెళ్లి చేసుకున్న అనంత రం ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి చేసుకున్నా తమను పెద్దలు కలిసి ఉండనీయరనే అను మానం తో వారు ఆత్మహత్య చేసుకుని ఉం టారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువతి తండ్రి కోటేశ్వరరావు పట్టణంలో సెల్‌ఫోన్‌ రిపేరు చేస్తుండగా, యువకుడి తండ్రి శ్రీనివాసరావు సోడాలు అమ్ముతూ జీవిస్తుంటారు. యువతి తండ్రి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నజీర్‌  బేగ్‌ చెప్పారు. 

Updated Date - 2021-01-19T05:27:39+05:30 IST