Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 18:39:47 IST

Sushmita Sen: మాజీ బాయ్ ఫ్రెండ్‌తో ప్రీమియర్‌లో సందడి చేసిన హీరోయిన్

twitter-iconwatsapp-iconfb-icon

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ (Sushmita Sen) కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌(Rohman Shawl)కు ఆమె గతంలోనే బ్రేకప్ చెప్పింది. అనంతరం ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi)తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. తామిద్దరం డేటింగ్ చేస్తున్నామని లలిత్ మోదీనే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సుస్మిత గతంలోనే రోహ్మాన్ షాల్‌కు బ్రేకప్ చెప్పినప్పటికీ తాజాగా అతడితో జంటగా కనిపించి అందరికీ షాకిచ్చింది. 


సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). ఇండస్ట్రీలోని సెలబ్రిటీల కోసం చిత్ర బృందం ముంబైలో సినిమా ప్రీమియర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రీమియర్‌కు సెలబ్రిటీలు దీపికా పదుకొణె (Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)లతో పాటు అనేక మంది హాజరయ్యారు. ఈ స్పెషల్ షోకు సుస్మిత తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌, పిల్లలు రిన్నే సేన్, అలీషా సేన్‌లతో హాజరయింది. సుస్మితా సేన్ తన మాజీ బాయ్ ఫ్రెండ్‌తో కలసి ప్రీమియర్‌కు రావడంతో ఫొటోగ్రాఫర్లందరు క్లిక్ మనిపించడం మొదలుపెట్టారు. అనంతరం కాసేపటికే ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుస్మిత అభిమానులు సైతం ఆ వీడియోను షేర్ చేయడం మొదలుపెట్టారు. లలిత్ మోదీ ఎక్కడ అని సరదాగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు.     


లలిత్ మోదీతో డేటింగ్ విషయం తెలియగానే కొంత మంది సుస్మితను ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సుస్మిత  స్ట్రాంగ్‌గా బదులిచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘నాకు పరిచయం లేనివారు, నేను ఎప్పుడు కలవని మిత్రులు నా జీవితంపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మేధావులు ఫన్నీ గాసిప్స్‌ను ప్రచారం చేస్తున్నారు. నా చుట్టూ ఉన్న దయనీయ ప్రపంచాన్ని చూసి నాకు  చాలా బాధేసింది. నేనొక ‘గోల్డ్ డిగ్గర్’ అని చెబుతున్నారు. నిజానికీ గోల్డ్ కన్నా డైమండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాటిని సొంతంగా కొనుక్కోగలను. ఇటువంటి సమయంలోను నాకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులు, స్నేహితులకు ధన్యవాదాలు. మీ సుష్ (సుస్మిత) బాగానే ఉందని దయచేసి తెలుసుకోండి. మీ ఆమోదం, పొగడ్తలపై నేను జీవితాన్ని గడపడంలేదు’’ అని సుస్మితా సేన్ పోస్ట్ పెట్టింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement