పట్నా: sushil kumar modi బీహార్‌లో భోజ్‌పురి, మగహి భాషలలో రూపొందుతున్న అశ్లీల పాటలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. ఇటువంటి పాటలు, వీడియోలపై నితీష్ కుమార్ ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలని కోరారు. దీనిపై సుశీల్ కుమార్ మోదీ వరుస ట్వీట్లు చేశారు.
వివాహ వేడుకల సందర్భంగా నిర్వహించే ఊరేగింపులలో అశ్లీలత తాండవిస్తున్నదన్నారు. పైగా ఎవరైనా ఇటువంటి పాటలు, నృత్యాలను అడ్డుకుంటే వారిపై దాడులకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వం ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. భోజ్‌పురి, మగహీ బాషలలో అశ్లీల వీడియోలు రూపొందించి విడుదల చేస్తున్నారని, ఇవి మహిళలను కించపరిచేవిగా ఉంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, అదేవిధంగా అశ్లీలతను అడ్డుకోవాలని కోరారు.