న్యూఢిల్లీ: జైలులో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కు బెయిలు ఇవ్వవద్దని పోలీసులు హైకోర్టులో వాదించారు. ఒలింపిక్ పతక విజేత, ఛాంపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ గ్లోబ్‌ట్రాటర్ అని,అతనికి బెయిల్ మంజూరు చేస్తే పరార్ అయ్యే అవకాశముందని ఢిల్లీ నగర పోలీసులు సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. 2021 మే 4వ తేదీ రాత్రి ఛత్రసల్ స్టేడియంలో సుశీల్ కుమార్ అతని సహచర రెజ్లర్లు అయిన ధనకడ్, భగత్ సింగ్, జైభగవాన్లను కిడ్నాప్ చేసి కొట్టాడు. ధనకడ్ గాయాలతో మరణించగా, మిగిలిన ఇద్దరు కోలుకున్నారు. సుశీల్ కుమార్ ను హత్యా నేరం కింద పోలీసులు గత ఏడాది మే 23 న అరెస్టు చేశారు.సుశీల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.ధనకడ్ హత్య కేసులో సుశీల్ కుమార్ ప్రధాన నిందితుడని ఢిల్లీ పోలీసులు పునరుద్ఘాటించారు.
‘‘సుశీల్ కుమార్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, అతని ఉన్నతమైన ప్రొఫైల్ వల్ల కేసులో సాక్షులను బెదిరించే అవకాశం ఉంది.అతని సహచరులు భయపడి, రక్షణ కోరుతూ కోర్టు ముందు ఒక అభ్యర్థనను దాఖలు చేశారు’’ అని పోలీసులు కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. సుశీల్ కుమార్ ధన్కడ్ను హత్య చేశాడని, పిస్టల్‌తో ఛత్రసాల్ స్టేడియంలో తిరుగుతూ ట్రైనీ రెజ్లర్లను కొట్టాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.సుశీల్ గతంలో పారిపోయాడని, అందువల్ల అతని బెయిల్ దరఖాస్తును కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇవి కూడా చదవండి