Abn logo
Aug 1 2020 @ 12:48PM

జూన్ 29 నుంచి సుశాంత్ ఏం చెయ్యాలనుకున్నాడో తెలుసా?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదా? అతడి మృతి వెనుక బాలీవుడ్ పెద్దలు, రాజకీయనాయకుల హస్తముందా? బాలీవుడ్ మీడియా, కొందరు సినీ ప్రముఖులు అవుననే అంటున్నారు. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ కూడా  ఆ వాదననే సమర్థిస్తోంది. జూన్ 29 నుంచి ఏమేం పనులు చేయాలో ఓ వైట్‌బోర్డ్‌పై సుశాంత్ రాసి పెట్టుకున్నాడు. ఆ ఫొటోను శ్వేత పోస్ట్ చేశారు. 


త్వరగా నిద్రలేవాలి, పుస్తకాలు చదవాలి, గిటార్ నేర్చుకోవాలి, మంచి సినిమాలు చూడాలి, జూన్ 29 నుంచి రోజూ వర్కవుట్లు చేయాలి, మెడిటేషన్ చేయాలి అంటూ తను చేయాలనుకున్న పనుల జాబితాను  సుశాంత్ రాసుకున్నాడు. `జూన్ 29 నుంచి రోజూ వర్కవుట్లు చేయాలి, మెడిటేషన్ చేయాలని  సుశాంత్ ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాడు. కాబట్టి అతడు భవిష్యత్తు గురించి ఆలోచించాడని అర్ధమవుతోంద`ని శ్వేత పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వ్యక్తి ఇలా భవిష్యత్తు ప్రణాళిక ఎందుకు వేసుకుంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  సుశాంత్‌కు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు. Advertisement
Advertisement
Advertisement